Wednesday, April 8, 2026
Homeకెరీర్ న్యూస్SSC Results | మే మొదటివారంలో ఎస్. ఎస్.సి. రిజల్ట్స్..

SSC Results | మే మొదటివారంలో ఎస్. ఎస్.సి. రిజల్ట్స్..

  • కొనసాగుతున్న పేపర్లు దిద్దే కార్యక్రమం..
  • పరీక్షల్లో ఒక విద్యార్థి డీబార్..5 గురు సిబ్బంది సస్పెండ్..

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది. ఈ నెల 23తో ముగుస్తుంది. ఫలితాలు క్రోడీకరించి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

పదో తరగతి పరీక్షల్లో మంగళవారం ఒక విద్యార్థి డిబార్‌ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదుచేశారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు సిబ్బందిని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌ను అధికారులు విధుల నుంచి తప్పించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News