Monday, April 6, 2026
HomeసినిమాVanda Devullu | ఆసక్తిని పెంచేసిన విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ టీజర్

Vanda Devullu | ఆసక్తిని పెంచేసిన విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ టీజర్

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రూపుదిద్దుకుంరూపుదిద్దుకుంటుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అందరిలోనూ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.

- Advertisement -

ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ కథ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఆ చుక్క ఏంటి? ఊర్లో ఏం జరిగింది? ఊరి ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏ పని చేస్తే పరువు పోయింది? అసలు అందరూ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు?

అనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా టీజర్‌ను కట్ చేశారు. ఇక ఈ టీజర్‌లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలున్నాయని అర్థం అవుతోంది. మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటిని కలగలపి ఓ అద్భుతమైన సెంటిమెంట్‌తో ‘వంద దేవుళ్ళు’ తెరకెక్కించారని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు : శశి
సంగీతం : బాలాజీ శ్రీరామ్
డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ : హరిష్ యువరాజ్
మాటలు : భాష్య శ్రీ
పీఆర్వో : సాయి సతీష్

- Advertisement -
RELATED ARTICLES

Latest News