- ఈస్టర్ వేడుకలకు హాజరైన పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్
సికింద్రాబాద్ పరిధిలోని సౌత్ లాలాగూడా బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.ఆదివారం తెల్లవారుజామునే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా,విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకున్నారు.ఈస్టర్ వేడుకలకు ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ హాజరై విశ్వాసులకు తన సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు ప్రేమ,త్యాగం,క్షమాగుణం గురించి సందేశాలు అందించారు.
చెడు మీద మంచి విజయం సాధించిన దినంగా ఈస్టర్ ప్రాముఖ్యతను వివరించారు.ప్రార్థనల అనంతరం ప్రత్యేక గీతాలు,భక్తి కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా మార్చారు.చర్చ్ ప్రాంగణాన్ని పూలతో,లైటింగ్‌తో అందంగా అలంకరించారు.పిల్లలు,యువత ఈస్టర్ సందేశాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం విశ్వాసులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలు భక్తుల్లో ఆనందం,ఐక్యతను పెంపొందించడంతో పాటు సమాజంలో శాంతి,సౌభ్రాతృత్వానికి దారితీశాయి.వేడుకల్లో చర్చి ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఎం క్రిష్టఫర్,రెవ.పి.జె.ప్రకాశం,రెవ డి.విల్సన్ పాల్,రెవ.డి.విద్యాసాగర్,చర్చి కమిటీ సెక్రటరీ వర కుమార్ బొజ్జం,వైస్ ప్రెసిడెంట్ బైరపాక ప్రవీణ్,జాయింట్ సెక్రెటరీ డి.సాంసన్,ట్రెజరర్ మంద గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
