కురుమ సామాజిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ త్యాగం సాహిద పోరాట యోధుడు మహనీయుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిహెచ్ఎంసి జవహర్ నగర్ బాలాజీ నగర్. పరిధిలో. బీరప. గుడి.వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తొలి మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ ఇటువంటి మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
దొడ్డి కొమరయ్య చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బండ కింది ప్రసాద్, సుధాకర్ చారి, రంగుల సతీష్, ఆలేరు రమేష్, దాయాల. ఐలయ్య.చిట్కూరి రమేష్, ఉమ్మల సదానందం, పల్ల.కుమార్, పెద్దల శ్రీనివాస్, సూర్ణ .ఆంజనేయులు,బిడ.మల్లేష్, క్యామ పర్వతాలు, కేశపురం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
