- వారి అడుగులకు మడుగులొత్తున్న కొందరు అవినీతి అధికారులు..
- అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలు..
- డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఐఏఎస్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన విద్యార్థి సంఘాల నాయకులు..
- తక్షణమే చర్యలు తీసుకుని మూసివేయాలి..
- డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు..
- చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నవీన్ నికోలస్, ఐఏఎస్..
అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలను తక్షణమే చర్యలు తీసుకొని మూసేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఐఏఎస్ కి వినతి పత్రం సమర్పించారు విద్యార్థి సంఘాల నాయకులు.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్న ప్రజా ప్రతినిధులముగా, మీ దృష్టికి తీసుకురావడం జరుగుతోందని పేర్కొన్నారు.. విద్యార్థి సంఘాల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు..
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పరిధిలోని చందా నాయక్ తండా, అయ్యప్ప సొసైటీ ప్రాంతాలలో నారాయణ విద్యాసంస్థలు వివిధ పేర్లతో, ముఖ్యంగా నారాయణ కో-క్యాంపస్, నారా యణ వారాహి క్యాంపస్, నారాయణ కె.కె క్యాంపస్, నారాయణ ది వన్ స్కూల్ ఇలా పేర్లు మార్చుతూ, తల్లిదండ్రులను మభ్యపెట్టి ముం దస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.. అయితే ఈ విధంగా దాదాపు 16 కో స్కూల్స్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్నారు..

ఇందులో కేవలం నాలుగు స్కూళ్లను మాత్రమే సీజ్ చేశారు.. విచిత్రం ఏమిటంటే సీజ్ చేసిన ఈ నాలుగు స్కూళ్లకు నిబంధనల ప్రకారం సెక్షన్ 18 (5) ప్రకారం ఎందుకు జరిమా నాలు విధించలేదని వారు తెలిపారు.. కాగా మిగిలిన దాదాపు పది నారాయణ కో స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు.. మిగిలిన నారాయణ కో స్కూల్స్ ను కూడా సీజ్ చేసి జరిమానాలు విధించి, తక్షణమే వసూలు చేయాలని కోరారు..
ఇంకా ముఖ్యంగా.. ఈ విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి అనుమతులు లేవు. కాగా ఈ స్కూళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేవు.. ముఖ్యంగా తాగునీటి సదుపాయం వంటి ప్రాథమిక అవసరాలు కూడా లేవు.
ఈ విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కి పలుమార్లు ఫిర్యాదు చేయగా, సీజింగ్ ఆర్డర్ జారీ చేశారు.. అయినప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు పేర్కొన్నారు..
ముఖ్యంగా, రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్, 2009 లోని సెక్షన్ 18 (5) ప్రకారం విధించవలసిన జరిమానాలు ఇప్పటివరకు విధించలేదు.
ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమైందే కాకుండా, ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించే చర్యగా పరిగణించవలసినదని వారు పేర్కొన్నారు..

కావున మా వినతి ఏమిటంటే..
- అనుమతులు లేని నారాయణ విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలి.
- బాధ్యులపై ఆర్.టి.ఈ. ఆక్ట్, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
- సెక్షన్ 18 (5) ప్రకారం జరిమానాలు వెంటనే విధించాలి.
- ఇప్పటికే ఇచ్చిన సీజింగ్ ఆర్డర్ ను పూర్తిగా అమలు చేయాలి.
- తల్లి దండ్రులను మభ్యపెట్టి తీసుకున్న అడ్మిషన్లపై విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
కనుక ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని, విద్యార్థుల భవిష్యత్తును రక్షించగలరని వారు తమ విజ్ఞప్తిలో తెలియజేశారు.. దీనిపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఐఏఎస్ సానుకూలంగా స్పందించి, విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారని విద్యార్థి సంఘ నాయకులు తెలియజేశారు.. కాగా కొందరు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన, ప్రభుత్వానికి రావలసిన ఆదాయం పక్కదారి పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు..
కొందరు అవినీతి అధికారులు తమ జేబులు నిండితే చాలను కుంటూ స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే అమ్యా మ్యాలకు ఆశపడి నిబంధనలను కాలరాస్తున్నారు.. లంచాలు తీసుకున్నారు కాబట్టి అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.. ఇక దీనిని ఆసరాగా చేసుకుంటున్న నారా యణ విద్యాసంస్థల యాజమాన్యం పిల్లల జీవితాల తో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.. అందుకనే డైరెక్టర్ ఉఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఫిర్యాదుచేశామని వారు తెలిపారు..
