Friday, April 24, 2026
Homeరంగారెడ్డిFelicitation | ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీకి ఘన సత్కారం

Felicitation | ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీకి ఘన సత్కారం

  • మీడియా ఐక్యతతో సమాజానికి మేలు
  • నూతన కమిటీకి అభినందనలు తెలిపిన పిల్లి నాగరాజు ముదిరాజ్, జితేందర్ రెడ్డి

ఉప్పల్ ప్రాంతంలో మీడియా ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఉప్పల్ మీడియా క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా) అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఉప్పల్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పిల్లి నాగరాజు ముదిరాజ్ వారి కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పిల్లి నాగరాజు ముదిరాజ్, పూడూరి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు.

మీడియా ఐక్యతతో పనిచేస్తే ప్రజలకు మరింత న్యాయం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. నిజాయితీతో వార్తలను ప్రజలకు అందిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

- Advertisement -

అదేవిధంగా ఉప్పల్ మీడియా క్లబ్ అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్, ప్రధాన కార్యదర్శి ఆనంద నరసింహారెడ్డి లు మాట్లాడుతూ, మీడియా ఐక్యతతోనే సంస్థ బలపడుతుందని, సభ్యులందరూ కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమని తెలిపారు. భవిష్యత్తులో మీడియా ప్రతిష్టను మరింత పెంచేలా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News