Thursday, April 2, 2026
Homeరంగారెడ్డిప్రజా పాలన-ప్రగతి ప్రణాలిక 99 రోజుల కార్యచరణపై సమగ్ర చర్చ

ప్రజా పాలన-ప్రగతి ప్రణాలిక 99 రోజుల కార్యచరణపై సమగ్ర చర్చ

అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ఆద్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అధితులుగా రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ డీహెచ్‌ఓ పాపారావు, MPDO శ్రీవాణి పాల్గోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలను భాగస్వామి చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందజేయాలని, గ్రామ అభివృద్ధి, గ్రామ సమస్యల గుర్తింపు, పదకాల అమలులో పారదర్శకత పెంపుకోసం సమగ్ర చర్చ జరిపారు.

ఈ కార్యక్రమంలో విద్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, పంచాయతీ సెక్రెటరీ తుల్జా ప్రసాద్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మొగుళ్ల జీవన్ రెడ్డి, మాచగోని మహేందర్ ముదిరాజ్, తాటిపల్లి రమేష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గడ్డమీది దశరథ, తూర్పునూరి శివకుమార్, దర్శనం యాదయ్య, దీపిక నాగరాజ్, మంజుల నరసింహ, బండి సునీత ఉపేందర్, శ్రీలత, కేతావత్ నరేష్, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, మాజీ ప్రజా ప్రతినిధులు. మరియు ఇతరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News