- నెలరోజుల పాటు మ్యాచ్ కి దూరమైన ధోనీ..
- స్టార్ హిట్టర్ డెవిల్స్ బ్రెవిం కూడా దూరం..
ఈ సీజన్‌లో ఆరో టైటిల్‌పై కన్నేసిన మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు టోర్నీ మొదలవడానికి ముందే వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. గాయం కారణంగా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కనీసం నెల రోజుల పాటు టోర్నీకి దూరమైన వార్తను చెన్నై అభిమానులు జీర్ణించుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. సోమవారం గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనున్న సీఎస్‌కే..
స్టార్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ సేవలనూ కోల్పోయింది. పక్కటెముకల గాయంతో ఈ సఫారీ సంచలనం తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడని చెన్నై హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. అయితే బ్రెవిస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడు రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయని జట్టు వర్గాల సమాచారం.
- Advertisement -
- Advertisement -
