- జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి
రైలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వంచే ఉచితంగా అమృతకు మంజూరైన నూతన ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాజీ డి సి సి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్పోక్స్‌పర్సన్ సింగి రెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు పథకం పేదలకు గృహసౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ రెడ్డి, మెడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ చీర్ల రమేష్, రైలాపూర్ రమణగారి భోపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు సాయిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు రమణ రెడ్డి, సత్తి రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొవ్వడే మహేష్, నరేందర్,రవి, మాజీ సర్పంచ్ సురేందర్, భాస్కర్ రెడ్డి,మాధవ రెడ్డి, మురళి,ఇంద్రమ్మ కమ్యూనిటీ అధ్యక్షుడు సాయిరెడ్డి సత్తి రెడ్డి, సభ్యులు కమాటి ప్రవీణ్(మాజీ వార్డ్ మెంబర్), జల్లి బాలేష్ (మాజీ వార్డ్ మెంబర్), విద్య, సాయిరెడ్డి అరుణ జ్యోతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నవీన్ ముదిరాజ్, జి. కార్తిక్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
