- ప్రశ్నించిన నెటిజన్ నాయిని శరత్ రెడ్డి..
- నిధులు లేకపోతే గ్లోబల్ సమ్మిట్ ఎందుకు..?
‘ఖజానా ఖాళీ అయ్యింది.. నన్ను కోసినా రూపాయి లేదు’ అంటూనే ఈ దుబారా ఖర్చులేమిటంటూ ప్రముఖ నెటిజన్ నాయిని శరత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సూటిగా నిలదీశారు. ‘ఆరు గ్యారెంటీలు అమలుచేయమంటే పైసల్లేవు అంటావు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధుల్లేవు అంటావు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఊరంతా జెండాలు కట్టడానికి ఈ ఐదున్నర కోట్లు ఎకడినుంచి వచ్చాయి సీఎం గారు? ఇవేమైనా మీ ఇంటి నుంచి తెచ్చిపెడుతున్నారా?’ అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, బీచ్ ప్లాగ్, తాత్కాలిక స్టాళ్లు, ఎల్ఈడీ డిస్ప్లే కోసం కోట్లలో ఖర్చు చేసిన టెండర్ డాక్యుమెంట్లను గురువారం ఎక్స్‌వేదికగా ఆయన పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.రాష్ట్ర వార్తలు
రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం రాష్ట్రానికి నయా పైసా లాభం చేకూర్చని ‘గ్లోబల్ సమ్మిట్’కు అక్షరాలా రూ.5 కోట్ల 58 లక్షలు ఖర్చుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రభుత్వ తీరు ఎలా ఉం దంటే.. ఇంట్లో తినడానికి మెతుకుల్లేకపోయినా, వీధిలో ఊరేగింపు కోసం పట్టు వస్త్రాలు అప్పు తెచ్చుకున్నట్టుగా ఉన్నది’ అని మరికొందరు ఎద్దేవాచేస్తున్నారు.
