నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కల్లు గీతా కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అబ్దుల్లాపూర్మెట్ కేంద్రంలోని ధర్మ బిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం నిరుపేదల పక్షాన నిలబడి నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహించారన్నారు.
అనేక భూ పోరాటాల నిర్వహించి పేదలకు భూములు పంపిణీ చేయించారు. గీత కార్మికుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి వారి హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మ బిక్షం విగ్రహాన్ని ట్యాంక్ బండి ఫై ఏర్పాటు చేయాలన్నరూ. సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు నామకరణం చేయాలని కోరారు. సిపిఐ మండల కార్యదర్శి అజ్మీర్ హరి సింగ్ నాయక్ అధ్యక్షతన జరిగిన.
ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, మాజీ ఎంపీపీ బబ్బురి మంజుల దేవేందర్ గౌడ్, మాజీ జెడ్పిసి బిగి దాసు గౌడ్, బాటసింగారం రైతు సేవ సహకార సంఘం మాజీ చైర్మన్ పురం యాదిరెడ్డి, అబ్దుల్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ తోర్పునూరి ప్రవీణ్ కుమార్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బాత్ లక్ష్మణ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేతరాజు మంజుల నరసింహ, సిపిఐ నాయకులు మధు, రమేష్ నాయక్, రవి, సైదులు ముదిరాజ్, అన్న పూర్ణ, రాములు, లక్మి, యాదగిరి, పుల్లయ్య, సాయిలు, బిక్షపతి, ch.లక్ష్మి, నిరంజన్, బిచ్చి నాయక్, పాండు, సైదులు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
