Monday, March 23, 2026
Homeరంగారెడ్డిఅంతర్జాతీయ స్థాయిలో డా. పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ మరోసారి సత్తా చాటారు

అంతర్జాతీయ స్థాయిలో డా. పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ మరోసారి సత్తా చాటారు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ డా. పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో వెండి పతకాన్ని సాధించి, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా గుర్తింపు పొందారు.

డా. సత్యవోలు రాంబాబు (Founder & CEO) ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో నిర్వహించిన “విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారాలు 2026” కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్చి , తుమ్మిడి రామ్ కుమార్, రవి శంకర్ మాలిసెట్టి (డిప్యూటీ కమిషనర్, కస్టమ్స్), సినీ నటుడు రాజీవ్ కనకాల, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రదీప్ కుమార్ ఈ విజయం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News