ఎస్పీ జానకి షర్మిల శనివారం పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, చిన్నారులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను శాంతిసామరస్యాలతో జరుపుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ, సీఐలు, ఎస్సైలు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
