- ఎండాకాలంతో తప్పనిసరి..
- కోకుం జ్యూస్, ఆమ్ల జ్యూస్ మంచి ఛాయిస్..
వేసవి వేడి ఎక్కువగా పెరుగుతున్న సమయంలో ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శరీరాన్ని చల్లబరిచే పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వేసవిలో బయట మార్కెట్ లో లభించే శీతల పానీయాలకు బదులుగా సంప్రదాయ జ్యూస్ లను తీసుకోవడం మంచిది. వేసవిలో తీసుకోదగిన సహజ పానీయాల్లో కోకుమ్ జ్యూస్, ఉసిరి జ్యూస్ లు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు.
ప్రజలు కూడా వేసవిలో కోకుమ్ జ్యూస్, ఆమ్లా జ్యూస్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంప్రదాయ సూపర్‌ఫుడ్స్‌తో తయారయ్యే ఈ జ్యూసులు శరీరానికి లోపల నుంచి చల్లదనం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కోకుమ్ పండ్లు, మొత్తం ఉసిరి కాయలు పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి.
- Advertisement -
