- ఈ యోగా చేస్తే చాలు..
- జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకండి..
జీర్ణ సమస్యలైన ఉబ్బరం, మలబద్ధకం, నెమ్మదిగా పనిచేసే మెటాబాలిజం ఇవన్నీ ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారుతున్నాయి. కూర్చుని పని చేసే జీవనశైలిని కలిగి ఉండడం, ఒత్తిడి, అసమయ భోజనం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది తీసుకునే ఆహారం జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, కొన్ని యోగాసనాలు కూడా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
యోగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు అవయవాలను ఉత్తేజితం చేస్తుంది. గట్-బ్రెయిన్ కనెక్షన్‌ను సమతుల్యం చేస్తుంది. నిరంతరం యోగా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు గ్యాస్ సమస్య తగ్గుతుంది. మొత్తం పొట్ట ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగాసనాలల్లో పవనముక్తాసనం ఒకటి. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. ముందుగా మెత్తపై పడుకోవాలి. ఒక మోకాలు ఛాతీ వైపు తీసుకురావాలి. రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపుకు దగ్గరగా నొక్కాలి. కొన్ని సెకన్లు అలాగే ఉంచి, తర్వాత మరో కాలుతో ఇలాగే చేయాలి. ఈ ఆసనం పొత్తికడుపుపై ఒత్తిడి కలిగించి జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది. భుజంగాసనం వేయడం ద్వారా కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
