Wednesday, March 18, 2026
Homeఆంధ్రప్రదేశ్Putta Mahesh Kumar | ఎంపీ పుట్టా మహేష్ పై అధిష్టానం సీరియస్..

Putta Mahesh Kumar | ఎంపీ పుట్టా మహేష్ పై అధిష్టానం సీరియస్..

  • పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి..
  • మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు..

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్ర*గ్స్‌ పార్టీ లో పట్టుబడిన ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. పార్టీ వార్తలు పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డ్ర*గ్స్‌ కేసులో మహేష్‌ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని వెల్లడించారు.

డ్ర*గ్స్‌ వంటి ఘటనల్లో ఎవరూ ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి ప్రాజెక్టులు వ్యక్తులు, నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని పేర్కొన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌లో డ్ర*గ్స్‌ పార్టీ పై పోలీసులు దాడు చేసి పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల దాడుల సమయంలో కాల్పులు కలకలం సృష్టించాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News