Friday, March 13, 2026
Homeబిజినెస్Stock Market | భారీ నష్టాల్లో భారత మార్కెట్లు..

Stock Market | భారీ నష్టాల్లో భారత మార్కెట్లు..

  • 1360 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లు నష్టపోయింది. 23,144 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఈ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యునీలీవర్ మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, మిగతా షేర్లు నష్టాల బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 50 సూచీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

మిడిల్ ఈస్ట్ యుద్ధం, చమురు సంక్షోభం, ధరల పెరుగుదల వంటివి నేటి మార్కెట్ పతనానికి కారణాలు. విదేశీ ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురై అమ్మకాలకు పాల్పడ్డారు. అయితే, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు పైగా పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News