మనిషిని-సమాజాన్ని స్వార్థం, అవినీతి, ఆధిపత్యం క్యాన్సర్లా పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం మారణహోమాలు జరుగుతున్నాయి. మనిషి ఎంతగా దిగజారాడంటే! బీమా డబ్బుల కోసం అమానవీయంగా ప్రాణాలు తీసుకునే బంధాలు కూడా కనిపిస్తున్నాయి. చట్టసభల్లో పాలక-ప్రతిపక్ష నాయకులు అనైతికంగా పరస్పరం తిట్టుకుంటున్నారు. కులం-మత గొడవల్లో కత్తులు దూసుకుంటున్న జనం, ఆ మంటల్లో ఓటు బ్యాంకును వెతుక్కుంటున్న నేతలు.. పరిమితి లేని ప్రేమలో కూరుకుపోయిన యువతీయువకులు, నిజమైన ప్రేమ పక్షుల రెక్కలు విరిచే క్రూర ఘటనలు, టీచర్లనే కొడుతున్న విద్యార్థులు… సమాజం ఎటువైపు పోతుంది? మనిషితనం మాయమైపోతోంది. మానవీయ మూలాలను వెతుక్కొని మళ్లీ మనిషిగా మారడం కలేనా? నిజమయ్యేనా?
- మేదాజీ
- Advertisement -
