Homeఆరోగ్యంAwareness | మూత్ర పిండాల ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోలేమా!

Awareness | మూత్ర పిండాల ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోలేమా!

  • 12 మార్చి “ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవం” సందర్భంగా

ప్రతి ఏటా మార్చి 2వ గురువారం ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవం (వరల్డ్‌ కిడ్ని డే)” జరుపుకుంటూ కిడ్నీల ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవడం, ప్రచారం నిర్వహించడం నిరంతరం జరగాలి. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం వరకు పెద్దలు ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యలతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. మూత్రపిండ సమస్యలు ముదిరితే లక్షలాది రోగులు అకాలమరణం బారిన పడుతున్నారు.

మూత్ర పిండాల సమస్యలను నిరోధించడానికి ముందస్తుగా పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణాలు దక్కుతాయని గమనించాలి. మూత్ర పిండ సమస్యలు నిశ్శబ్దంగా తీవ్రరూపం దాల్చుతుంటాయి. ముత్ర పిండాలు రక్తం నుండి వ్యర్థాలను, అదనపు ద్రవాలను ఫిల్టర్‌ చేస్తూ బిపీ, ఎలక్ట్రొలైట్‌ సమతుల్యత కల్పిస్తూ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయ పడతాయి.

- Advertisement -
World Kidney Day 2026 Kidney Health Awareness1

ప్రపంచ మూత్ర పిండాల దినోత్సవం – 2026 ఇతివృత్తం :

మూత్ర పిండాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రచారం చేయడానికి “ఇంటర్నేషనల్‌ కిడ్నీ ఫౌండేషన్”‌, “ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కిడ్నీ పౌండేషన్”‌ సంయుక్తంగా 2006 నుంచి ప్రతి సంవత్సరం మార్చి మాసంలో రెండవ గురువారం, అనగా 12 మార్చి 2026 రోజు “ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం” పాటించడం ఆనవాయితీగా మారింది.

మూత్ర పిండాల ఆరోగ్య సంరక్షణకు చేపట్టవలసిన జీవనశైలి మార్పులు, తరుచుగా పరీక్షలు, సాధారణ మెలకువలు లాంటి అంశాలను విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతోంది. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం-2026 ఇతివృత్తంగా “అందరికీ మూత్ర పిండాల ఆరోగ్యం : ప్రజల సంరక్షణ, భూగోళ రక్షణ” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

World Kidney Day 2026 Kidney Health Awareness0

మూత్ర పిండాల ఆరోగ్య పరిరక్షణ చర్యలు:

మూత్ర పిండాల ఆరోగ్య సంరక్షణకు నిత్యం తగినంత నీటిని త్రాగడం, సమతుల ఆహారం తీసుకోవడం, రక్తపోటు నియంత్రణ, మధుమేహ అదుపు, క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండడం, అతిగా మద్యం సేవించకుండా ఉండడం, మితిమీరిన ఇతర నొప్పి నివారణ మందులు వాడకాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, మూత్ర పిండాల పట్ల అవగాహన కలిగి ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలినా పాటించడం, దురలవాట్లకు దూరంగా ఉండడం లాంటివి పాటించాలి.

మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అలసట, పాదాల వాపు, చీలమండల వాపు, మూత్ర విసర్జనలో మార్పులు, బలహీనత, ఆకలి మందగించడం, నురగ లేదా రక్తంతో కూడిన మూత్ర విసర్జన, కళ్ళ చుట్టు వాపు, వికారం వంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. మూత్ర పిండాల సమస్య తీవ్రత పెరిగి వైఫల్యానికి లోనయితే డయాలిసిస్‌, మూత్ర పిండ మార్పిడి కూడా అవసరం అవుతాయి.

మూత్ర పిండ సమస్యలకు కారణాలు – రోగ లక్షణాలు :

మధుమేహం, అధిక బిపీ ఉన్న వారు క్రమం తప్పకుండా కిడ్నీల పని తీరు పరీక్షలు చేయించుకోవాలి. జన్యుపరమైన కారణాలు కూడా కిడ్నీ సమస్యలకు రాకుండా కావచ్చని గమనించాలి. గుండె జబ్బులు, స్ట్రోక్ చరిత్ర ఉన్న వ్యక్తులకు మూత్ర పిండ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

60 ఏండ్లు పైబడిన వృద్ధులు, అధిక బరువు, పునరావృత ఇన్ఫెక్షన్లు, మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తులు, మూత్ర పిండాల ప్రభావంతో దీర్ఘకాలిక మందులు వాడే వ్యక్తులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూత్ర పిండాల ఆరోగ్య పరీక్షలకు రక్తం, మూత్రం, ఇమేజింగ్‌, కిడ్నీ బయాప్సీ, అదనపు పరీక్షలు లాంటివి డాక్టర్లు పర్యవేక్షణలో చేయించుకోవాలి.

అన్ని రకాల మూత్ర పిండ సమస్యలను నివారించకపోవచ్చు. కాని బిపీ, షుగర్‌, బరువు నియంత్రణ, దురలవాట్లకు దూరంగా ఉండడం, నొప్పి నివారణ మందులను తగ్గించడం, క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం, వ్యాయామం చేయడం లాంటి జీవనశైలిని పాటించాలి.

ప్రారంభ దశలో నిశ్శబ్దంగా వచ్చే మూత్ర పిండ సమస్యలకు సకాలంలో స్క్రీనింగ్‌ చేయించుకోవడం ముఖ్యమని తెలుసుకోవాలి. వృద్ధులు, అధిక బిపీ, అధిక షుగర్‌, తెలివిగా తినడం, గుండె జబ్బులు, జన్యుపరమైన చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేటి ఒక చిన్న ప్రయత్నం రేపటి పెద్ద సమస్యను నివారిస్తుందని మరిచిపోరాదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News