Thursday, March 5, 2026
HomeజాతీయంLoco Pilot | మొండికేసిన లోకో పైలట్..

Loco Pilot | మొండికేసిన లోకో పైలట్..

  • బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో సంఘటన..

పని గంటలు ముగియడంతో రైలు నడిపేందుకు లోకో పైలట్‌ నిరాకరించాడు. రైల్వే నియమాలకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఒక స్టేషన్‌లో ఆ రైలు మూడు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాల్డా నుంచి సిలిగురి వెళ్తున్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్‌ బుధవారం మధ్యాహ్నం 2:52 గంటలకు ఠాకూర్ గంజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది.

ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై అది ఆగింది. కాగా, తన పని గంటలు ముగిసినట్లు లోకో పైలట్‌ తెలిపాడు. నిర్దేశించిన 9-10 గంటల పని గంటల పరిమితికి మించి రైలును నడపలేనని అధికారులకు తెలియజేశాడు. విశ్రాంతి లేకుండా రైలు నడిపేందుకు నిరాకరించాడు. దీంతో ఠాకూర్ గంజ్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై మూడు గంటలకుపైగా ఆ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- Advertisement -

మరోవైపు ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఆ లోకో పైలట్‌ పని గంటలు ముగిసే సమయానికి మరో లోకో పైలట్‌ను అందుబాటులో ఉంచకపోవడం అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News