Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిHoli Celebrations | హోలీ.. హోలీ…హోలీ.. రంగుల రంగేలి.

Holi Celebrations | హోలీ.. హోలీ…హోలీ.. రంగుల రంగేలి.

  • హోలీ వేడుకల్లో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్.
  • శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ మంకాల శ్రీశైలం, ఉప సర్పంచ్ అవులమంద శివశంకర్.
  • మండలంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు.

హోలీ.. హోలీ..హోలీ.. రంగుల రంగేలి అంటూ నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బుధవారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.చేగూర్ గ్రామంలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రజాప్రతినిధులు గ్రామంలోని యువతతో కలిసి సహజ సిద్ధమైన రంగులను చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామ సర్పంచ్ మంకాల శ్రీశైలం, ఉప సర్పంచ్ అవులమంద శివశంకర్ లు, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ కు హొలీ శుభాకాంక్షలు తెలుపుతూ, రంగులు చల్లారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ హోలీ అనేది రంగుల పండుగని, ఇది వసంత కాలం రాకను సూచిస్తుందన్నారు.

అలాగే చెడుపై మంచి విజయం సాధించినందుకు సంతోషంలో జరుపుకుంటారని తెలిపారు.అనంతరం ప్రజలు,యువకులు, గ్రామస్థులు అందర్నీ కలుస్తూ స్నేహపూరిత వాతావరణంలో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రశాంతంగా పండగ చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పలు కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యువకులు,మహిళలు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News