Monday, March 2, 2026
Homeఆరోగ్యంSleep | రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదా..?

Sleep | రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదా..?

  • అయితే ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

నేటి త‌రుణంలో స‌మ‌యానికి నిద్ర పోవ‌డం కూడా కష్ట‌త‌రంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. నిద్ర కూడా శ‌రీరానికి చాలా అవ‌స‌రం. కానీ చాలా మంది నిద్రపోవ‌డంపై అంత‌లా శ్ర‌ద్ద చూపించ‌రు. నిద్ర‌ను విస్మ‌రిస్తూ ఉంటారు. ఫోన్ ల‌ను ఎక్కువ‌గా చూడ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి టీవీలు చూడడం, రాత్రి స‌మ‌యంలో ఆల‌స్యంగా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల విశ్రాంతి తీసుకోవ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంది.

అయితే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో నిద్ర గురించి ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌డుకునే ముందు వెన్న తిన‌డం వ‌ల్ల బాగా నిద్ర వ‌స్తుంద‌ని ట్రెండ్ న‌డుస్తోంది. అయితే రాత్రి స‌మ‌యంలో వెన్న తిన‌డం వ‌ల్ల నిజంగా నిద్ర వ‌స్తుందా.. ఇందులో వాస్త‌వ‌మెంత‌.. వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప‌డుకునే ముందు వెన్న తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంద‌ని, ఎక్కువ స‌మ‌యం నిద్ర పోతారని చెప్ప‌డంలో ఎటువంటి ఆధారాలు లేవ‌ని వైద్యులు చెబుతున్నారు. వెన్న‌లో ఎక్కువ‌గా సంతృప్త కొవ్వులు, త‌క్కువ మొత్తంలో నిద్ర‌కు ఉప‌యోగప‌డే ప్రోటీన్, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఉంటాయి. వెన్న‌ను నిద్ర‌కు స‌హాయ‌కంగా ఉప‌యోగించ‌డం సోష‌ల్ మీడియాలో ఒక ట్రెండ్ మాత్ర‌మే అని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

మంచి నిద్ర‌కు క్ర‌మ‌బ‌ద్ద‌మైన అల‌వాట్లు చాలా అవ‌స‌ర‌మ‌ని కూడా వారు చెబుతున్నారు. అలాగే రాత్రి స‌మ‌యంలో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గ‌డం వ‌ల్ల చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, గుండె వేగంగా కొట్టుకోవ‌డం వంటి ల‌క్ష‌ణాల కార‌ణంగా నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. ఇలా చ‌క్కెర స్థాయిలు త‌గ్గ‌కుండా ఉండ‌డానికి చాలా మంది వెన్న వంటి కొవ్వు ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం మంచిద‌ని భావిస్తూ ఉంటారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News