Sunday, March 1, 2026
Homeసాహిత్యంPoetry | పల్లె వాతావరణం కళ్ళకు కట్టిన రేపటి తరం కోసం

Poetry | పల్లె వాతావరణం కళ్ళకు కట్టిన రేపటి తరం కోసం

ఈ పుస్తకం కరోనా నాటి కష్టాలను తెలుపుతూ, పల్లె జీవన విధానం “రేపటి తరం కోసం” కవితా సంపుటి ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు కవి ఎజ్జు మల్లయ్య. మొదటి కవితలో ‘ఓ మూర్ఖత్వపు మనిషి’ మహమ్మారి కరోనా పరిస్థితులు తీసుకుని రాశారు. వైద్యుడా వందనం అంటూ తన చిన్ననాటి నుండి వైద్యులు చేసిన సేవలను యాదికి చేసుకుంటూ డాక్టర్ లకు పాదాబివందనం అంటున్నారు. కరోనా సమయంలో తన తమ్ముడు పోలీస్ గా నిర్వహించిన భాధ్యతలను గుర్తుకు తెచ్చుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాకి ఉన్న బంధం వివరిస్తూ కరోనా కాలంలో యూనివర్సిటీ నుండి విద్యార్థులు దూరమైన సందర్భం గుర్తుకు చేశారు. కరోనా సమయంలో పట్టణ, గ్రామ పరిస్థితులను తెలియజేశారు. కరోనాలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు గొప్పవని కొనియాడారు. వలస కూలీలు లాక్ డౌన్ లో తమ ప్రాంతాలకు కాలి నడక మైళ్ళ ప్రయాణము యాదికి చేశారు. కరోనా వ్యాపించకుండా పరిశుభ్రత గురించి వివరించారు.

- Advertisement -

కరోనాలో ప్రేమ పెరిగిందని ప్రేమ గొప్ప తనము గురించి తెలిపారు. పల్లె వాతావరణం అమ్మ ఒడిలాంటిదని పల్లె మమకారం యాదికి చేశారు. కరోనా దేశం వదిలి వెళ్తే బాగుండు అన్నారు. సలాం పోలీసన్నా అంటూ పోలీస్ లా సేవలను అపారమైనవి అన్నారు. మరోసారి బాల్యంలో ఆడిన ఆటలు బావుల్లో ఈదిన రోజులు చిన్నపుడు చేసిన అల్లరి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పెద్ద చదువుల కోసం పట్టణాలకు వెళ్ళే పిల్లల గురించి తల్లిదండ్రులు పడే వేదన తెలిపారు.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరం పెట్టే పిల్లలకు అది సరైన పద్ధతి కాదని అంటారు. విశాఖపట్నంలో విష వాయువులు వల్ల జరిగిన విషాదం గురించి భాదతో రాశారు. ‘మా అమ్మ’ కవితలో వారి తల్లి యంత్రంలా ఇంట్లో పనులు చేస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచుతుందని అంటున్నారు, మరో కవితలో నాన్న జీవితమే నాకు ఆదర్శం అంటారు. కవుల ప్రత్యేకతను తెలుపుతూ అన్నదమ్ముల అనుబంధం బలమైనదని అన్నారు. కోచింగ్ సెంటర్ లలో ఫ్యాకల్టీల కష్టాలు వివరించారు.

సినారె మనల్ని వదిలి వెళ్ళిన సందర్భం తన కవితతో యాదికి తెచ్చుకున్నారు, సినారెకు గజల్ కు ఉన్న బంధం తెలిపారు. దేశానికి సైనికులు చేస్తున్న సేవలు గుర్తు చేశారు. ప్రపంచీకరణలో పల్లెలు మారుతున్నాయి అంటున్నారు. ‘తెలుగు తేజం’ కవితలో పి. వి నరసింహారావు మేధస్సును యాదికి తెచ్చుకున్నారు. విషాద సంఘటనలపై స్పందించే హృదయము కవికి ఉండాలంటారు. వ్యవసాయానికి పల్లెకు ఉన్న బంధాన్ని తెలిపారు.

మనిషి ఉన్నత శిఖరాలకు ఎదగాలంటారు. ఆకలి తీర్చే అన్నయ్య అంటూ సోనూసూద్ మానవత్వపు సేవా గుణం గొప్పదని చెప్పారు. నా కలం రైతుల పక్షమని చెప్పుకున్నారు. పెరిగిన కమ్యూనికేషన్ తో బంధాలు దూరమైతున్నాయని గుర్తుకు చేశారు. మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు దూరమైతే పడే వేదన తెలిపారు. సమాజ హితం కోసం పని చేసిన వారు గొప్పవారంటారు. వరదలు వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల పరిస్థితి గుర్తుకు చేశారు. ‘రేపటి తరం కోసం’ కవితలో నిత్య విద్యార్థిగా విజయ తీరం వైపు ప్రయాణించాలంటారు. బువ్వ పొద్దు అనే పదము పాలమూరులో వాడుతారు.

పోలిస్ లా సేవలు గుర్తుకు చేస్తూనే పోలిస్ అన్నా జర గతాన్ని దృష్టిలో పెట్టుకుని మంచికై ముందుకు వెళ్లమంటారు. తెలంగాణ ఔన్నత్యాన్ని ఉన్నతంగా విశ్లేషించారు. ఆడపిల్లలు పుడితే అదృష్ట తలుపు తట్టిందని భావిస్తూ వారిని గౌరవించాలంటారు. ఊళ్లలో తిరిగె బస్సుల కోసం ఎదురు చూసే సందర్భం యాదికి చేశారు. ఓట్ల రోజు ముందు ఓటు వేసిన తర్వాత పొందే అనుభూతి తెలిపారు.

చివరి కవిత అయిన ‘నా మాటలు’ లలో మానవుడు సన్మార్గములో జీవిస్తూ విజయ తీరం వైపు పరుగులు తీయాలంటారు. ఈ కవితా సంపుటిలో ప్రతి కవిత చదువుతున్న వారికి మన జీవితంలో జరిగిన సందర్భాలే అన్నట్లు ఉంటుంది, అంత చక్కగా రాశారు, సామాజిక అంశాలను క్రోడికరిస్తూ, పల్లె వాతావరణం యాదికి చేస్తూ, కరోనా కష్టాలను తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News