- రాప్తే. హెచ్ వీ నుంచి దేశీయ మార్కెట్ లోకి..
- ధర సుమారు రూ. 2.39 లక్షలుగా నిర్ణయం..
ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ రాప్తే.హెచ్‌వీ..దేశీయ మార్కెట్లోకి నయా బైకును విడుదల చేసింది. టీ30 పేరుతో విడుదల చేసిన ఈ మోటర్‌సైకిల్ ప్రారంభ ధర రూ.2.39 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. సింగిల్ చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నది. 3.5 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
ప్రస్తుతం ఈ బైకులు దక్షిణాది మార్కెట్లో మాత్రమే విక్రయిస్తున్నట్టు, భవిష్యత్తులో ఉత్తరాదిలోకి ప్రవేశించనున్నట్టు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ దినేశ్ అర్జున్ తెలిపారు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరులో ఈ బైకులు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నట్టు, ఆ తర్వాత హైదరాబాద్‌లో విడుదల చేయనున్నట్టు చెప్పారు.
- Advertisement -
