Sunday, March 1, 2026
Homeమెదక్‌Accident | ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

Accident | ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

కొండపాక మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన గొడుగు అంజనేయులు (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం శిరసనగండ్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన అనంతరం స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజనేయులను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. యువకుడి మృతితో విశ్వనాథపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News