Thursday, February 26, 2026
Homeరంగారెడ్డిInauguration | ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటింట సౌభాగ్యం.

Inauguration | ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటింట సౌభాగ్యం.

  • షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్.
  • గిరిజన తండాల్లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

ఇందిరమ్మ రాజ్యంలోని ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఇంటింట సౌభాగ్యాన్ని అందిస్తుందని శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. నందిగామ మండల కేంద్రంలోని బండకుంట తండాలో సర్పంచ్ కొమ్ము కృష్ణ, ధన్ సింగ్ తండాలో సర్పంచ్ గబ్రు చౌహన్ ల ఆధ్వర్యంలో నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి బుధవారం షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.లబ్ధిదారులైన కొర్ర జయరామ్,కొర్ర బుజ్జి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చి, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.ప్రజలు ఎల్లప్పుడూ సేవ చేసే నేతలకు,ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో కూడ ఆశీర్వదించాలని కోరారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చే వారినే ప్రజాప్రతినిధులు అంటారని పేర్కొన్నారు. గిరిజనుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

- Advertisement -

పలు కార్యక్రమాల్లో ఏఎంసి డైరెక్టర్ చింతలపల్లి నర్సింహా,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్,మండల అధ్యక్షులు జంగ నర్సింలు,సర్పంచ్ మల్లేష్,పిఏసీఎస్ డైరెక్టర్ రూప్ సింగ్,సిఐ ప్రసాద్,ఎంపిఓ చక్రధర్,మాజీ సర్పంచులు రాజు నాయక్,కావలి కృష్ణ,మాజీ ఎంపిటిసిలు చంద్రపాల్ రెడ్డి,కుమారస్వామి,ఉప సర్పంచులు ముడావత్ రవీందర్ నాయక్,ఎర్ర వెంకటేష్,వార్డు సభ్యులు శివగళ్ల ప్రవీణ్, జటావత్ రాజేష్ నాయక్,జటావత్ మాధవి లక్ష్మణ్ నాయక్,పాత్లవత్ బుజ్జి శంకర్ నాయక్, (ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు) పాత్లవత్ శ్రీను నాయక్,ముడావత్ శాంతి శ్రీనివాస్ నాయక్,మేఘావత్ నాగేష్ నాయక్,మేఘావత్ పత్తి శ్రీను నాయక్, నాయకులు తులసిరామ్ నాయక్,గోపాల్ నాయక్,విజయ్ నాయక్,ఆకుల జ్ఞానేశ్వర్,శేఖర్ గౌడ్,వెంకట్ చారి, గడ్డం జంగయ్య,రవీందర్, కార్యదర్శి రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -
RELATED ARTICLES

Latest News