Tuesday, March 17, 2026
Homeరంగారెడ్డిIllegal | మైసమ్మగూడా లో జోరుగా అక్రమ నిర్మాణాలు

Illegal | మైసమ్మగూడా లో జోరుగా అక్రమ నిర్మాణాలు

  • నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు..
  • చోద్యం చూస్తున్న అధికారులు…?
  • నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం…
  • జిల్లా కలెక్టర్ కు స్థానికుల పిర్యాదు..

వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అనేది పాత సామెత మేడ్చల్ సర్కిల్ జిహెచ్ఎంసి అధికారులకు పక్కాగా సరిపోతుంది. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో అచ్చం అలాగే ఉంది అధికారుల పనితీరు చూస్తుంటే, డివిజన్ పరిధిలో అక్రమాలను ఉపేక్షించబోమని అధికారులు చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో నిత్యం ఏదో ఒకచోట అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఒకరు జి+ రెండు అంతస్తులు అనుమతులతో జి+ ఐదు లేదా ఆరు అంతస్తుల భవనాలు నిర్మాణాలు చేస్తుంటే మరొకరు రేషిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్నారు. మరికొందరు అయితే వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా నిత్యం గుండ్లపోచంపల్లి పరిధిలో ఏదోఒక చోట ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టాన్ని కలిగిస్తున్నారు.

- Advertisement -

ఇంతలా అక్రమాలు జరుగుతున్న వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలను నిర్ములన కోసం హైడ్రా తీసుకువచ్చి అక్రమార్కులకు చెమటలు పట్టిస్తుంటే మేడ్చల్ సర్కిల్ అధికారులు దానికి భిన్నంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

మైసమ్మగూడలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మైసమ్మగూడలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ మల్లారెడ్డి విద్యాసంస్థలు ఉండటంతో విద్యార్థుల వసతి కోసం హాస్టళ్ల వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది. దింతో కొందరు బిల్డర్ల అవతారం ఎత్తి ఇష్టానుసారంగా భావన నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా జి+ రెండు అంతస్తుల అనుమతులతో ఐదు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు.

ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని అధికారుల చేతివాటం ఉండటంతో ఇలాంటి నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పలువురు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.

టౌన్ ప్లానింగ్ విభాగం ఎక్కడ..?

మేడ్చల్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన నిర్మాణాలు ప్లానింగ్ లో అనుమతులు పొందిన దానికి భిన్నంగా జరుగుతున్నాయి. భావన నిర్మాణం అనుమతులు డాక్యుమెంట్ లో ఒకలా ఉంటే నిర్మాణలు మరోలా జరుతుతున్నాయి. దింతో పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన ఖజానాకు భారీగా గండీ ఏర్పడుతుంది.

గుండ్లపోచంపల్లిలో గతకొంత కాలంగా పూర్తి స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో అక్రమ నిర్మాణాల విషయంలో కొంతమంది ఆడింది ఆటగా తయారైంది. అక్రమ నిర్మాణాలు అరికట్టాల్సిన అధికారులు తూతుమంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News