Monday, February 23, 2026
Homeరంగారెడ్డిLB Nagar | మాధవ్‌నగర్ కాలనీలో కరెంట్ సమస్య పరిష్కారం..!

LB Nagar | మాధవ్‌నగర్ కాలనీలో కరెంట్ సమస్య పరిష్కారం..!

  • చెట్ల కొమ్మల తొలగింపు!!

ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్ డివిజన్ లోని మాధవ్‌నగర్ కాలనీలో నెలకొన్న కరెంట్ సమస్య పరిష్కారంలో భాగంగా విద్యుత్ తీగలకు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను ఈరోజు తొలగించారు. ఎలక్ట్రికల్ డీఈ రాజేందర్, బైరమలగూడ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కారణంగా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

చెట్ల కొమ్మలను పూర్తిగా తొలగించడం ద్వారా కాలనీలో విద్యుత్ సరఫరా సమస్యకు ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్‌నగర్ కాలనీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఎన్నో రోజులుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన ఎలక్ట్రికల్ శాఖ అధికారులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బందికి కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

కాలనీ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రమ, విజయ్, సేనా రెడ్డి, ఉయ్యాల యాదయ్య గౌడ్, డాక్టర్ ప్రణీత్, కృష్ణసాగర్, సత్తయ్య, సాగర్ పాల్గొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ ట్రీ కటింగ్ సూపర్వైజర్ ఆనంద్, ఎలక్ట్రికల్ లైన్‌మ్యాన్ ప్రవీణ్, మహేందర్, నరసింహ, బలరాం తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News