పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.


ఏప్రిల్ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం, కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 28న ప్రచురించనున్నారు.
