Wednesday, February 18, 2026
Homeమెదక్‌Birthday | బండాపోతుగల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Birthday | బండాపోతుగల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను చిలిపిచేడ్ మండలంలోని బండాపోతుగల్ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు.తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు.కేసీఆర్ భగవంతుడి ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు ఆయురోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి , శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, విభీషన్, మాణిక్యం, ముస్తాక్, వహీద్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News