Monday, February 16, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంJahnavi Township | పేరు మార్చి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టే కుట్ర..!

Jahnavi Township | పేరు మార్చి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టే కుట్ర..!

యాదాద్రి జిల్లా, రాజాపేట మండల్, చెల్లూరు గ్రామంలో అక్రమ వెంచర్..

  • సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం..
  • శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న మరో మాయాజాలం..
  • నిబంధనలకు వ్యతిరేకంగా సాల్వో వారి వెంచర్..
  • సర్వే నెంబర్ : 322 లో సుమారు 70 ఎకరాల్లో వెంచర్..
  • ఈ వెంచర్ కి చూపించిన రోడ్ కూడా వివాదంలో ఉంది..
  • వెంచర్ కోర్టు వివాదంలో ఉండగా జాహ్నవి టౌన్ షిప్ గా పేరు మార్పు..
  • క్లీన్ చిట్ ఉందంటూ నమ్మబలుకుతూ అమ్మకాలు..
  • అక్రమాలపై వరుస కథనాలు అందిస్తున్న ‘ఆదాబ్ హైదరాబాబ్’

ఆయనమీద ఎన్నెన్నో ఆరోపణలు.. భూములను ఆక్రమించి అక్రమ వెంచర్లు వేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడని, కోర్టులను దిక్కరిస్తున్నాడని, సంబంధిత అధికారులను డబ్బులతో కొనేస్తూ తన పనులు జరుపుకుంటున్నాడని, ఆయన వెనకాల పేరున్న రాజకీయ నాయకులు వున్నారని.. ఇలా అనేకానేక ఆరోపణలు ఉన్నాయి.. ఇవన్నీ చెప్పుకుంటూపోతే చాటభారతం అవుతుంది.. ఇప్పుడు ఆయన వేసిన ఒక వెంచర్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది.. ఆ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట్ మండలం, చెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 322 లో దాదాపు 70 ఎకరాల్లో సాల్వో ఎక్స్ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధినేత శ్యామ్ సుందర్ రెడ్డి ఒక వెంచర్ వేశాడు.. పలు వివాదాల్లో ఈ వెంచర్ కోర్టు పరిథిలో వుంది.. అంతే కాకుండా 210 సర్వే నెంబర్ చూపిస్తూ ఈ వెంచర్ కి వేసిన రోడ్ కూడా కోర్టు వివాదంలో ఉంది..

ఆర్.టి.ఐ. ద్వారా వెంచర్ గురించిన అక్రమాలు బయటపడ్డాయి.. శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న అక్రమ వెంచర్ గురించి తెలిసిపోయాక.. ఆయన మరో ప్లాన్ వేశాడు.. ఈ వెంచర్ కి జాహ్నవి టౌన్ షిప్ అంటూ పేరు మార్చి అమ్మకాలు చేపట్టినట్టు తెలుస్తోంది.. ఈ వెంచర్ లో కొనుగోలు చేస్తే అమాయకులు బలైపోయే ప్రమాదం ఉంది.. అసలీ వెంచర్ అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారు.. వెంచర్ వ్యవహారం కోర్టు పరిథిలో ఉన్నాసరే అమ్మకాలు జరుగుతుంటే ఏమి చేస్తున్నారు..?

ఒకప్పుడు ఈయనగారి ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి నోటీసులు మాత్రమే పంపించి ఆతరువాత చోద్యం చూశారని ఆరోపణలు ఎన్నెన్నో ఉన్నాయి.. తప్పుచేసిన వారిని తప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా..? అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది.. ఎందుకంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి కలిగిన శ్యామ్ సుందర్ రెడ్డిని టచ్ చేయడానికి అధికారులు వెనుకంజవేస్తున్నారా..? కేవలం ఆయన విదిలిస్తున్న ఎంగిలి మెతుకులకు ఆశపడ్డారా..?

ఈయన చేస్తున్న అక్రమాల్లో స్థానిక రాజకీయ నేతలకు సైతం సంబంధం ఉందా..? అన్నది ఇప్పుడు జిల్లాలో నడుస్తున్న చర్చ.. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే.. తాను వేసిన వెంచర్ ప్రమాదంలో పడిందని తెలియగానే.. సదరు శ్యామ్ సుందర్ రెడ్డి తన కన్నింగ్ బ్రెయిన్ కు పదునుపెట్టి.. వెంచర్ పేరును జాహ్నవి టౌన్ షిప్ గా మార్చి.. పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా.. పాత వెంచర్ కే కొత్త హంగులు చేర్చి అమాయకులకు అంటగట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు..

కాగా ఇప్పుడు ఈ పేరుతో అమ్మకాలు చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు..? కోర్టు పరిధిలో ఉన్న వెంచర్ లో కొనుగోళ్లు ఎలా సాధ్యం అవుతున్నాయి.. ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గానీ, ఇతర సంబంధిత అధికారులు గానీ ఏమి చేస్తున్నారు..? ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయకులకు ఎవరు అండగా ఉంటారు.. అసలు ఏ బేసిస్ లో ఈయన ఇంత నిర్భయంగా అమ్మకాలు చేయగలుగు తున్నాడు..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిం ది..

అసలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాలన సాగుతోందా..? అధికారులు పనిచేస్తున్నారా..? అమాయకులు బలైపోతున్నా, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతున్నా, నిబంధనలు తుంగలో తొక్కబడుతున్నా.. ఎవరికీ చలనం కలగడం లేదా..? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబు తారు..? ” జాహ్నవి టౌన్ షిప్ ” పేరుతో శ్యామ్ సుందర్ రెడ్డి చేస్తున్న మరో నాటకం వెనుక సూత్రధారులు ఎవరు..? అన్న విశేషాలను సాక్షాదారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదరాబాద్”..“మా అక్షరం అవినీతిపై అస్త్రం”

- Advertisement -
RELATED ARTICLES

Latest News