Thursday, February 12, 2026
HomeతెలంగాణComplaint | చిన్న జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..

Complaint | చిన్న జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..

  • మలక్ పేట్ పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసిన రాష్ట్రీయ వానరసేన

ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 4, 2026న నిర్వహించిన కార్యక్రమంలో చిలకమర్రి శ్రీమన్నారాయణ చార్యులు అలియాస్ చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని తీవ్రంగా కలతకు గురిచేశాయి.

జగద్గురువు శ్రీమద్భగవద్ శంకర భగవత్పాదుల వారు స్థాపించిన పీఠాలైన పూరి, ద్వారక, జ్యోతిర్మఠ, శృంగేరి పీఠాల స్థాపనపై ఆయన చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన అభిప్రాయపడుతోంది. అద్వైత సంప్రదాయం, స్మార్త పరంపర, హిందుత్వ మూల సాంప్రదాయాలపై అనవసర సందేహాలు కలిగించే విధంగా చరిత్రను వక్రీకరించడం దురదృష్టకరం.

- Advertisement -

శంకర భగవత్పాదుల వారి కాల పరిమితిని తక్కువ చేసి చూపించడం, ఆయన స్థాపించిన పీఠాలను ఇతరులవిగా పేర్కొనడం హిందూ ఆధ్యాత్మిక పరంపరను అవమానించడమే అని ఆరాష్ట్రీయ వానరసేన సంస్థ భావిస్తోంది.

ఈ అంశంపై మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు అందజేయబడింది. చట్టపరంగా విచారణ జరిపి, సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను రాష్ట్రీయ వానరసేన సంస్థ తరుపున మనవి చేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News