- సంచలన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నాయి..
- న్యూజిల్యాండ్ కు చుక్కలు చూపించిన యూఏఈ బ్యాటర్లు..
టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్లు చెలరేగిపోతున్నాయి. సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చెన్నైలో పటిష్టమైన న్యూజిలాండ్‌కు యూఏఈ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ ముహమ్మద్ వసీం() కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. అలీషన్ షరాఫు(55) హాఫ్ సెంచరీతోచెలరేగాడు. కివీస్ పేస్, స్పిన్ దళాన్ని ఉతికారేసిన ఈ ద్వయం విధ్వంసంతో 15 ఓవర్లకే స్కోర్ 120 దాటింది. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) దంచేశాడు. చివరి ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడడంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈకి బ్యాటర్లు భారీ స్కోర్ అందించారు. జాకబ్ డఫ్పీ తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ అయాన్ష్ శర్మ(8)ను వెనక్కి పంపి న్యూజిలాండ్‌కు బ్రేకిచ్చాడు. తొలి వికెట్ తీసి ఉత్సాహంలో ఉన్న కివీస్ జట్టును ముహమ్మద్ వసీం(64 నాటౌట్), అలీషాన్ షరాఫు(55)లు బెంబేలెత్తించారు. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం జోరుతో 12 ఓవర్లకే యూఏఈ స్కోర్ 120 దాటింది.
