Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌JSP | సీనియర్ జర్నలిస్టు ఏబీకేతో భేటీ

JSP | సీనియర్ జర్నలిస్టు ఏబీకేతో భేటీ

  • జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ సమావేశం

తెలుగు పత్రికా రంగాన్ని తీర్చిదిద్ది, పత్రికా రంగానికి తనదైనశైలిలో దిశానిర్దేశం చేసిన జర్నలిస్టు దిగ్గజం ఏబీకే ప్రసాద్ తో సీనియర్ జర్నలిస్టులు సాగర్ కుమార్, బుర్రా విజయ్ శేఖర్ లతో కలిసి సీనియర్ జర్నలిస్టు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని దుర్గా భాయి దేశ్ముఖ్ కాలనీలో తన కూతురు ఇంట్లో ఉన్న ఏబీకేను శుక్రవారం వారు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జర్నలిజంలో ఏబీకే ప్రయోగాలు, సమాజ హితమే పరమార్థంగా ఆనాడు జర్నలిస్టులు పని చేసిన విధానం, ప్రభుత్వంలోని పెద్దలు జర్నలిస్టులపై ఎలా కుట్ర కేసులు పెట్టే వారనే అనేక విషయాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని కేఎస్ఆర్ గౌడ తెలిపారు. అనేక మంది ఉత్తమ జర్నలిస్టులు శిష్యులుగా ఉండటమే తన సంపద అని ఏబీకే ఈ సందర్భంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. బుర్రా విజయ్ శేఖర్, సాగర్ కుమార్ మన కాలం నాటి జర్నలిజం తిరిగి రాదని, మనకు ఈ సంతృప్తి అయినా మిగిలిందని గుర్తు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తమకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారని కేఎస్ఆర్ గౌడ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News