Friday, May 22, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | చదువు, ఆరోగ్యం ఇవ్వని పాలన ఇక మాకొద్దు..

Aaj Ki Baath | చదువు, ఆరోగ్యం ఇవ్వని పాలన ఇక మాకొద్దు..

టికెట్టు కొనే స్థోమత ఉంది… మెతుకు కొనే సత్తా ఉంది.. బస్సు సీట్లో, బియ్యం బస్తాలో మా బతుకు వెతకకండి.. అడగని వరాలు కురిపించి ఓట్ల వలలు వేయకండి.. చిల్లర తాయిలాలతో మా ఆత్మగౌరవం కొనకండి..? కార్పొరేట్ చదువులు పేదవాడికి ఎందుకు అందవు.. ప్రాణం పోయే వేళ ఉచిత వైద్యం ఎందుకు ఇవ్వరు? లక్షల ఫీజుల బరువుతో మేధాశక్తిని చంపకండి.. ఆసుపత్రి బిల్లుల భయంతో ప్రాణాలు తీయకండి..? రాజ్యాంగం సాక్షిగా విద్య, వైద్యం మా ప్రాథమిక హక్కు. వాటిని వ్యాపారం చేసి, సమాజానికి చేయకండి ముప్పు.. బస్సు యాత్రలు కాదు… మా బతుకు యాత్ర మార్చండి.. ప్రజలంటే ఓట్లు కాదు… పౌరులని గుర్తించండి..? బిచ్చం కాదు మాకు కావాల్సింది… భవిష్యత్తుకి భరోసా.. చదువు, ఆరోగ్యం ఇవ్వని పాలన ఇక మాకొద్దు.. ఇది ఆవేదన కాదు… రగిలే గుండె చేస్తున్న హెచ్చరిక.. విప్లవమై నిలదీస్తాం… ఇక మార్పు తథ్యం..

  • సౌరం జితేందర్..
- Advertisement -
RELATED ARTICLES

Latest News