Friday, February 27, 2026
Homeనల్లగొండAlair | హామీల వరాలు... అమల్లో శూన్యం...

Alair | హామీల వరాలు… అమల్లో శూన్యం…

  • ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో మైనార్టీలకు ఒక్క సిటీవని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి.

బెదిరింపు రాజకీయాలు ఆలేరు నియోజకవర్గంలో చెల్లవు బిర్ల ఐలయ్య అంటూ ఘాటుగా స్పందించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి

ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి, 420లా వ్యవహరిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు పట్టణంలో 2,3,4,5,6,7,8,910,11 వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, రాష్ట్ర నాయకలు కల్లూరి రామచంద్ర రెడ్డి,పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొంగిడి సునీత మాట్లాడుతు…

సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో మైనార్టీలకు ఒక సిటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ బీర్ల ఐలయ్య నీవు మైనార్టీలను ఓట్లు ఎలా అడుగుతావు. రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు దక్కాల్సిన చోట కూడా నీవు ఆలేరులో రెండు వేల ఓట్లు ఉన్న మాల మాదిగ సామాజిక వర్గాలకు ఒక సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు.

నీ సామాజిక వర్గానికి మాత్రం నాలుగు సీట్లు ఇచ్చుకున్నావు.

దళితులు మైనార్టీలు అంటే నీకు అంత చిన్న చూపా…మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు మున్సిపాలిటీ కౌన్సిలర్ సీట్లలో మైనార్టీలను మరియు మాల మాదిగలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన గొంగిడి సునీత.

అసాధ్యమైన, అమలుకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలే మిగిలాయని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో రైతును రాజుగా చేసి, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తు చేశారు.

దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని స్పష్టం చేశారు. కళ్యాణ్ లక్ష్మి పథకంలో రూ.1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం కూడా రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, వికలాంగులకు రూ.6,000, వృద్ధులకు రూ.4,000 ఇస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలేరు యాదగిరిగుట్ట పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్, మొగులగాని మల్లేష్ గౌడ్,ఆడెపు బాలస్వామి,కందుల శంకర్, జంపాల దశరథ, కుండే సంపత్, బేతి రాములు,మోర్తాల రమణా రెడ్డి, కందుల శ్రీకాంత్,దడిగే రమేష్, జూల శ్రీధర్, ఆలేరు నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News