Saturday, March 14, 2026
Homeవరంగల్‌Parvathagiri | జీవనోపాదుల కల్పనకు కృషి చేయాలి.

Parvathagiri | జీవనోపాదుల కల్పనకు కృషి చేయాలి.

  • ఉపాధి హామీ పనులకు కూలీలను ప్రోత్సహించాలి.
  • మహిళా శక్తి, ఉపాధి భరోసా పథకాలను వినియోగించుకోవాలి.
  • వివో భవనాల నిర్మాణానికి జిపి తీర్మానం ఇవ్వాలి.
  • పర్వతగిరిఎంపీడీవో శంకర్ నాయక్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో మదర్ తెరిస్సా మండల సమైక్య ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల సహాయకులకు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, లకుపతి దీదీ అనే అంశాలపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీడీవో మాలత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో స్వయం సహాయక బృందాల మహిళలను జీవనోపాదులను పెంపొందించుకొని ఆస్తుల కల్పనకు వివో ఏలు కృషి చేయాలని సూచించారు.

మహిళా సంఘాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాయితీ రుణాల పై సభ్యులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించుటకు వివోఏలు కృషి చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులకు కూలీలను ప్రోత్సహించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి, ఉపాధి భరోసా పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -

ఈ సమావేశంలో ఏపిఎం రాజీర్, ఏపీఎం ట్రైనర్ కిరణ్, మండల సమైక్య అధ్యక్షురాలు స్వప్న, ఫరీదా రజిత, సీసీలు గోలి కొమురయ్య, వర్కాల సుధాకర్, దేవేంద్ర, పర్వతగిరి నెక్కొండ వివోఏలు జోత్స్న, సంధ్య, లావణ్య, సంకినేని మహేశ్వరి, నాంపల్లి మౌనిక, అరుణ, రాజయ్య, ఐలయ్య, యాకస్వామి, విజేందర్ ఎమ్మెస్ సిబ్బంది రాధిక, అరుణ ఎఫ్ఈసి శ్రీనివాస్, స్వప్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు పీఎంఈ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News