Thursday, February 26, 2026
Homeస్పోర్ట్స్T20 World Cup | సంజూ శాంసన్ కు అగ్ని పరీక్ష..

T20 World Cup | సంజూ శాంసన్ కు అగ్ని పరీక్ష..

  • నేడే సౌత్ ఆఫ్రికాతో ముంబైలో వార్మప్ మ్యాచ్..
  • చాలా మంది ఆటగాళ్లకు ఇది కీలక పరీక్ష..

ఐసీసీ టీ – 20 వరల్డ్ కప్ 2026కి ముందు దక్షిణాఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ సంజూ శాంసన్‌కు కీలక పరీక్ష. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన సంజూ, ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించకపోతే, వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

దాంతో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు భారత జట్టు తమ ఏకైక వార్మ్ అప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవి ముంబైలో ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్, టీమిండియాకు సాధారణ ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే కాదు.. కొందరు ఆటగాళ్లకు ఇది కీలక పరీక్షగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌కు ఇది చావో రేవో అన్న స్థాయిలో మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News