- విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రాం..
- ఈనెల 6 నుంచి ప్రసారం కానుంది..
- ప్రకటించిన ప్రధాని మోడీ..
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం ఫిబ్రవరి 6న ప్రసారం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులతో జరిగే ఈ వార్షిక సంభాషణ మరోసారి తిరిగి రావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని X వేదికగా వెల్లడిస్తూ, పరీక్షల ముందు విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచే ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు.
ఎక్స్ లో షేర్ చేసిన సందేశంలో, ఈసారి పరీక్షా పే చర్చ దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించినట్లు నరేంద్ర మోదీ వివరించారు. దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, ఢిల్లీ లోని ఏల్.కే.ఎం. కేంద్రాల్లో #ExamWarriorsతో ఈ సంభాషణ జరిగినట్లు తెలిపారు. ఎప్పటిలాగే యువతతో మాట్లాడటం, పరీక్షల ఒత్తిడి లేని వాతావరణం గురించి చర్చించడం తనకు ఎంతో తాజాదనాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 6న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌ను ప్రతి ఒక్కరు వీక్షించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
