Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిTribute | పేదల గుండెల్లో చిరస్థాయిగా నర్సింగ్ రావు గౌడ్

Tribute | పేదల గుండెల్లో చిరస్థాయిగా నర్సింగ్ రావు గౌడ్

పేదల గుండెల్లో చిరస్థాయిగా నర్సింగ్ రావు గౌడ్ నిలుస్తారని, యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని జవహర్ నగర్ మాజీ మేయర్ దొంతగాని శాంతి, కోటేష్ గౌడ్ తెలిపారు. నర్సింగ్ రావు గౌడ్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దొంతగాని శాంతి, కోటేష్ గౌడ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు గూడు దక్కాలని నిరంతరం పోరాడిన మహోన్నత నాయకుడు నర్సింగ్ రావు గౌడ్ అని చెప్పారు. చివరి శ్వాస వరకు పేదల అభ్యున్నతి కోసం వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ కారింగుల శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రాజ్ కుమార్, జింక నాగులు, బూడిద వెంకటేష్, మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, బాచుపల్లి రమేష్ చారి, శ్రీనివాస్, గొడుగు వేణు, గజ్వేల్ శంకర్, మంద ఆనంద్, బీసీ ఐక్యవేదిక సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News