Thursday, February 26, 2026
Homeఆంధ్రప్రదేశ్JSP | జై స్వరాజ్ పార్టీ ఏలూరు జిల్లా ఇంచార్జిగా మోహన్ రావు గౌడ్

JSP | జై స్వరాజ్ పార్టీ ఏలూరు జిల్లా ఇంచార్జిగా మోహన్ రావు గౌడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా జై స్వరాజ్ పార్టీ ఇంచార్జిగా జిల్లాకు చెందిన పరసా అమ్మ మోహన రావు గౌడ్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. జిల్లాలోని కామవరపుకోట గ్రామానికి చెందిన పరసా అమ్మ మోహన రావు గౌడ్ నియామక పత్రాలను సోమవారం ఆన్లైన్ లో పంపించారు. రాజకీయ అనుభవం ఉన్న మోహన రావు గౌడ్ ఏలూరు జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అదే విధంగా చాలా కాలంగా జై స్వరాజ్ పార్టీ అభిమానిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన రావు గౌడ్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏలూరు జిల్లాలో జై స్వరాజ్ పార్టీని పల్లె పల్లెకు విస్తరిస్తానని, తనను గుర్తించి జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కన్వీనర్లను, మండలాల అధ్యక్షులను పార్టీ అనుమతితో నియమిస్తామని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News