దేశభక్తి అంటే ప్రచారం కాదు.. సంస్కారమని నిరూపించిన ఆయన పేరు జితేంద్రసింగ్ రాఠోడ్. సూరత్‌లోని ఎస్వీఎన్ఐటీ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్(Security Guard)గా పనిచేస్తున్నారు. మన దేశ సైనికులు(Soldiers), అమర వీరుల(Immortal Heroes) చిత్రాలను ఏళ్లుగా భద్రపరుస్తూ వస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి(Republic Day) కరెక్టుగా పది రోజుల ముందు.. రాత్రి డ్యూటీలో ఉండగా ప్రధానమంత్రి కార్యాలయం(PMO) నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆయన జీవితంలోనే అత్యంత గర్వకారణమైన క్షణం. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు హాజరుకావాలనే ఆహ్వానం అందింది. ఆ సమయంలో ఆయన ఖాతాలో ఉన్నది కేవలం రూ.102 మాత్రమే. తన ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా వెల్లడించారు. ఆ నిజాయితీకి సంపూర్ణ గౌరవం లభించింది. విమాన టికెట్, వసతి, త్రివర్ణ పతాకం నీడలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అపూర్వ గౌరవం దక్కాయి. ఈ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు.
Patriotism | ఇది కదా నిజమైన దేశభక్తి అంటే
- Advertisement -
RELATED ARTICLES
