ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు శనివారం పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ(NTR Bharosa Pension Distribution) సహా వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. గుడిపల్లె మండలం బెగిలపల్లె గ్రామంలో పేదల సేవలో(Pedala Sevalo) అనే కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు 5555 ఇ-సైకిళ్ల పంపిణీ చేయనున్నారు. బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకు వేలాది ఇ-సైకిళ్ల ర్యాలీలో పాల్గొంటారు. ఒకేసారి వేలాది ఇ-సైకిళ్ల ర్యాలీతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేలా కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం.. కుప్పంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రజా వేదిక సభ అనంతరం వివిధ పథకాల లబ్దిదారులతో మాట్లాడతారు.
వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లబ్దిదారులతో భేటీ అవుతారు. పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సంభాషిస్తారు. కుప్పంలో సీఎన్జీ కాంపాక్టర్లను ఆవిష్కరించనున్నారు. నెట్ జీరో, వేస్ట్ మేనేజ్మెంట్‌పై ఐఐటీ కాన్సూర్ ఇచ్చిన నివేదికను పరిశీలించనున్నారు. తర్వాత.. సీఎం సమక్షంలో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన 7 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందాల విలువ రూ. 675 కోట్లు. ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీ, ఉడ్ స్టోన్ ఉత్పత్తుల పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
