Saturday, February 21, 2026
HomeతెలంగాణMedaram Jatara | వనంలో జనం.

Medaram Jatara | వనంలో జనం.

  • వైభవంగా సమ్మక్క – సారలమ్మ గద్దె చేరే ఘట్టం..
  • గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోనే వాహనాలు
  • వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తిన లక్షలాది భక్తులు
  • వనదేవతలకు మొక్కులు చెల్లించిన బ్రిటిష్ అధికారి
  • నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మూడో రోజైన శుక్రవారం పతాకస్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.

- Advertisement -

ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గ్దదెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమై నట్లయింది. గురువారం అర్ధరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్చేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్ లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

హైదరాబాద్ లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ శుక్రవారం మేడారం సందర్శించి, సంప్రదాయ వస్త్రధారణలో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఆయనకు జాతర ప్రాశస్త్యాన్ని వివరించారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం అమ్మవార్లను దర్శించుకున్నారు.

జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం గురువారం రాత్రి జరిగింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గిరిజన సంప్రదాయాల నడుమ మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క తల్లి ప్రయాణం ప్రారంభమవగానే, జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అర్ధరాత్రి దాటాక సమ్మక్క తల్లి గద్దెపైకి చేరారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరగా, సమ్మక్క తల్లి కూడా చేరడంతో భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News