ఎమెస్కో అధినేత విజయకుమార్‌కి సీఎం చంద్రబాబు అభినందన
ఏపీలోని ప్రభుత్వ గ్రంథాలయాల(Government Libraries)కు రూ.1.40 కోట్ల విలువైన బుక్స్(Books) అందించేందుకు ఎమెస్కో ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత విజయకుమార్(Vijayakumar) సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను విరాళంగా అందించేందుకు తమ సంస్థ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు విజయ కుమార్ తెలిపారు. ఆ పుస్తకాల జాబితాను సీఎంకు అందించారు. గ్రంథాలయాలకు ప్రచురణలు చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమెస్కో విజయ కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. గ్రంథాలయాలు సమాజంలో జ్ఞాన విస్తరణకు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పుస్తకాలు పంచడం అంటే జ్ఞానాన్ని పంచినట్లేనని అన్నారు. ప్రచురణల వితరణ ద్వారా విద్యార్థులు, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు.
