భారత ప్రభుత్వం అప్పుడే స్పందించి ఉంటే ఇంత ” తతంగం జరిగేది కాదు..
- మైనింగ్ ఈ-వేలంలో తీవ్ర అవకతవకలు.. సూర్యాపేట జిల్లాలో సంచలనం..
- సున్నపు గనుల వేలంలో అవకతవకలపై అప్పుడే ఫిర్యాదు..
- చిలికి చిలికి గాలివానగా మారి సమస్య ఇప్పుడు ఏకు మేకైంది..
- నిబంధనలు సరిగా అమలవకపోవడమే పెను దుమారానికి కారణం..
- పలు అనుమానాలు లేవనెత్తిన న్యాయవాది కామాటి వెంకట్ రెడ్డి..
- చట్ట విరుద్ధ ప్రక్రియలపై ఆరోపణలు.. సంబంధిత అధికారులకు ఫిర్యాదు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సింగరేణి పేరు మారుమ్రోగుతోంది.. నైనీ కాంట్రాక్ట్ వ్యవహారం ఎక్కడెక్కడికో తిరుగుతోంది.. మంత్రులు, ముఖ్యమంత్రి బంధువర్గం.. విపక్షాల నాయకులు.. ఎవరికీ తోచిన విధంగా వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు.. ఒకరు దళిత మహిళలపై అసహ్యమైన కథనాలు ప్రసారం చేశారంటూ ఒకవైపు విమర్శలు.. మరొకవైపు ఉపముఖ్యమంత్రి పై కథనాలు.. ఎవరికో లబ్ది చేకూర్చడానికి ఇంకేదో మతలబు చేస్తున్నా రంటూ విమర్శలు.. ఒక నాయకుడు కేంద్ర మంత్రికి లేఖ రాయడం.. ఆ మంత్రివర్యులు కమిటీ వేయడం..
అసలు ఆ కమిటీ ఏమి చేసిందో.. అర్ధం కానీ పరిస్థితి.. అసలు సింగరేణిని బ్రతికించాలనుకున్నారా..? లేక నాశనం చేయాలను కుంటున్నారా..? ఇలాంటి అనుమానాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు అర్ధంకాని గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. వ్యవహారం ఇంతవరకు ఎలా వచ్చింది.. మొక్కై వంగనిది మానై వంగుతుందా..? అన్నట్లు మైనింగ్ బ్లాకుల ఈ వేలం ప్రక్రియ ముందునుంచి సజావుగా జరిగి ఉంటే ఇంత ప్రళయం వచ్చి ఉండేది కాదు అంటున్నారు ఒక న్యాయవాది.. మైనింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ఆయన గళమెత్తుతూనే ఉన్నారు..
సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.. న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు.. చివరకు భారత ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు.. కానీ జరిగిందేమిటి..? తెలంగాణ నేలలోని ఖనిజ సంపదను అడ్డగోలుగా కొల్లగొడుతున్న వారిని అడ్డుకునే వారు లేకపోవడం దురదృష్టకరం.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ అవకతవకలు ఏమిటి..? ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన నైనీ వ్యవహారం ఏమిటి..?

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ విభాగం 30-08-2024 న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 2263906/໖໐ ໑໐໕ ໖…/2.2.6./2023 సున్నపు గనుల కోసం ఈ-వేలం నిర్వహించగా, చట్టపరమైన తప్పనిసరి నిబంధనలను పాటించలేదని న్యాయవాది కర్నాటి వెంకట రెడ్డి ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్ అనే మూడు మైనింగ్ బ్లాకులను ఈ-వేలం కోసం ప్రతిపాదించారు. అయితే, ఈ బ్లాకుల వారీగా కంపార్ట్మెంట్ వివరాలు, ఖచ్చితమైన ప్రదేశ నిర్ధారణ, యూటిఎమ్ జియో కో-ఆర్డినేట్లు (2 సెం.మీ. ఖచ్చితత్వంతో) వంటి కీలక అంశాలపై స్పష్టత లేకుండా ప్రజలకు తెలియకుండా అసంబద్ధంగా టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
-ఖనిజ వేలం నిబంధనలు, 2015, గనులు అండ్ ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1957 ప్రకారం, మైనింగ్ బ్లాకుల సరిహద్దులను డీజీపీఎస్ సర్వే ద్వారా నిర్ధారించి, అక్షాంశ రేఖాంశాలతో కూడిన వివరాలను టెండర్ నోటిఫికేషన్?లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఉల్లం ఘిస్తూ ఈ-వేలం నోటిఫికేషన్ జారీ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది..
ఈ అంశంపై ఫిర్యాదుదారు డబ్ల్యూపీ (పిల్) నెం. 21 ఆఫ్ 2024ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, సంబంధిత ప్రతివాదులకు అవకాశం కల్పించి నిర్ణయం తీసుకోవాలని గనులు అండ్ భూగర్భ శాస్త్ర సంచాలకుడిని కోర్టు ఆదేశించింది. అయిన ప్పటికీ, ఇప్పటివరకు ఆఆదేశాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు..

ఇదే సమయంలో, 1100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ఉన్న మైనింగ్ బ్లాకులను ఖచ్చితమైన సరిహద్దులు వేలం నిర్వహిస్తున్న సందర్భంలో సంబంధిత విషయాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచ కుండానే బిడ్లు విజేతలకు కేటాయించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. 22-11-2024న సైదుల్ నామా బ్లాక్? ను డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కు, సుల్తాన్పూర్ బ్లాక్‌ను ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు వేలంలో కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
డెక్కన్ సిమెంట్స్ అలాగే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ సంస్థలపై ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, పర్యావరణ ఉల్లంఘ నలకు సంబంధించిన కేసులు అప్పటికే తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.. మరోవైపు, పసుపుల బోడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ ను 18-11-2024న రద్దు చేశారు.
ఇదిలా ఉండగా, కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతంకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు 04-03-2025న కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతాలకు సంబంధించిన నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోపు నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఈ ఆదేశాలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో మైనింగ్ ఈ-వేలం ప్రక్రియపై కూడా సమగ్ర విచారణ జరిపి, తదుపరి నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు సి.ఈ.సి. కమిటీని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే పీ.ఎం.ఓ.పీ.జీ.//2024/0182169 నంబర్‌తో కేంద్రానికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2024 వ సంవత్సరం ఆగస్ట్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని మొట్టమొదటిసారిగా ఇస్తూ.. ఇది మాకు సంబంధించిన విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి.. అని చెప్పారని.. కానీ ఇప్పుడేమో ఆయనే కల్పించుకుని ఒక కమిటీని వేసి విచారణ చేయిస్తున్నారని దీనిని ఏమంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన భారత దేశ సుప్రీంకోర్టుచే నిర్మాణం చేయబడిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కోర్టు అంటే ఎక్స్పర్ట్ కమిటీ అంటారు వారి ముందు పిర్యాదు చేయడం జరిగింది.. దీనిపై త్వరలోనే విచారణ జరగబోతుంది.. సమాచార కమిషనర్ జోక్యంతో ఆ బ్లాక్ లకు సంబంధించిన సమాచారం ఆప్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత తనకు దానికి సంబంధించిన సమాచారం 8 నెలల తర్వాత వచ్చింది..
ఎవరు అయితే రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వారికే ఈ గనులు వచ్చాయి.. ఆరోజు ఆ వేలం ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేజర్ మినరల్ ఈ ఆక్షన్ మూడో విడత ప్రక్రియ నడుస్తుంది.
మైనర్ మినరల్ ఈ ఆక్షన్ నాలుగో విడత ప్రక్రియ నడుస్తోంది.. మైనర్ మినరల్ ఈ ఆక్షన్ ప్రక్రియలో అయితే కేంద్ర ప్రభుత్వం జారీచేసిన రూల్స్సక్రమంగానేపాటిస్తున్నారని ఆయన తెలిపారు.. పిన్ టు పిన్.. ఫిర్యాదుల ప్రక్రియ ఎలా కొనసాగింది..? కోర్టు ఏమి చెప్పింది..? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు సూచించింది..?
ఫిర్యాదు దారుడికి ఏమని జవాబు ఇచ్చింది..? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది.. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్‌లో ఎంత సమయా నికి జవాబు వచ్చింది..? ఇలాంటి మరిన్ని విస్తుపోయే నిజాలను మీకు వరుసగా అందించబోతోంది
