కరీంనగర్ పట్టణం స్థానిక హనుమాన్ నగర్‌లోని బ్లూ బెల్స్ పాఠశాలలో ఆదివారం యూలో టెక్కీ, రోబోటిక్స్ మరియు స్కిల్ దర్బార్ ప్రాజెక్టుల ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కార్యక్రమం ద్వారా కోడింగ్, రోబోటిక్స్‌పై ప్రాథమిక అవగాహనతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 350 మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు.
రోబోటిక్స్ విభాగంలో రోప్ కార్, లైన్ ఫాలోవర్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, సర్వో స్వీప్, మాన్యువల్ బూమ్ బారియర్, ఆటోమేటిక్ నైట్ లాంప్ వంటి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కోడింగ్ విభాగంలో పైథాన్, హెచ్ టి ఎం ఎల్, ఇంటర్నెట్ సేఫ్టీ, ఆటోమేటిక్ రెయిన్ షీల్డ్, కాలిక్యులేటర్, ఎర్త్ అరౌండ్ ది సన్, బర్త్ డే కేక్, ఫ్లాగ్ బుక్ వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే స్కిల్ దర్బార్ లో డిజిటల్ స్టోరీ టెల్లింగ్, ఈకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్వాలిటీ కోఆర్డినేటర్ కె. అశోక్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజినల్ మేనేజర్ ఫిరోజ్ ఖాన్ , యు లిప్స్ రీజినల్ హెడ్ సుప్రియా కుడాలి శ్రీనివాస్ బి. సురేందర్ రెడ్డి ప్రకాష్ పద్మజ అలెగ్జాండర్ షోయబ్ విజయ్ సుప్రియ హాజరయ్యారు.
యూలో టెక్కీ ప్రతినిధులు పాఠశాల ప్రిన్సిపల్ జంగా సునీత మనోహర్ రెడ్డి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గత రెండు విద్యా సంవత్సరాలుగా కంప్యూటర్ సబ్జెక్టులో భాగంగా కంప్యూటర్ సైన్స్‌ను పాఠ్యాంశంగా చేర్చి, విద్యార్థులకు రోబోటిక్స్ మరియు కోడింగ్ ప్రోగ్రామ్‌లపై శిక్షణ ఇస్తున్నామని. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, కోడింగ్ వంటి నైపుణ్యాలను విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే నేర్చుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నూతన ఆలోచన శక్తి సృజనాత్మకత ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
