Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌అంగడి బజార్ బస్తీలో తాగునీటి సమస్యపై ఆకస్మిక పర్యటన

అంగడి బజార్ బస్తీలో తాగునీటి సమస్యపై ఆకస్మిక పర్యటన

  • డిప్యూటీ మేయర్
  • శాశ్వత పైప్‌లైన్‌కు ఆదేశాలు – తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

తార్నాక డివిజన్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీ అంగడి బజార్ బస్తీలో నెలకొన్న తాగునీటి కొరత సమస్యపై గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా పర్యటించారు.ఈ పర్యటనలో టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బస్తీవాసులు సరిపడా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,వేసవికాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని డిప్యూటీ మేయర్‌కు విన్నవించారు.

నీటి కొరత కారణంగా ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.అలాగే అంతర్గత రోడ్ల దయనీయ స్థితిపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యపై వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ జలమండలి అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి,అంగడి బజార్ బస్తీకి శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అంతవరకు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నిత్యం తాగునీటి సరఫరా చేయాలని సూచించారు.

- Advertisement -

ఈ అంశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి,యూనివర్సిటీ పరిపాలన సహకారంతో తాత్కాలిక నీటి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.బస్తీవాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని డిప్యూటీ మేయర్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News