మొయినాబాద్, జనవరి 22(ఆదాబ్ హైదరాబాద్): పెద్దమంగళారం గ్రామ(Peddamangalaram Village) పరిధిలోని సర్వే నం.199లోని ప్లాట్ నంబర్లు B-83, B-84, B-92, B-93ల్లోకి అక్రమంగా ప్రవేశించి ఆస్తి నష్టం, బెదిరింపులకు పాల్పడ్డ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను గురుగు రాజశేఖర్(A1), గురకొండ అంజనేయులు(A2), ప్రొద్దుటూరు పాండు(A3), ప్రశాంత్(A4) కలిసి ల్యాండ్ ఓనర్, కేర్‌టేకర్, సెక్యూరిటీ గార్డులపై దాడులు చేసి, చెట్లను నరికివేసి, ప్రీకాస్ట్ వాల్‌ను ధ్వంసం చేసి, ప్రాణహాని తలపెట్టారని, బెదిరించి డబ్బు డిమాండ్ చేశారని కేసు నమోదైంది.
ఈ ఘటనపై Cr.No.33/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా A2 గురకొండ అంజనేయులు, A3 ప్రొద్దుటూరు పాండులను ఇవాళ అదుపులోకి తీసుకొని న్యాయస్థానం(Court)లో హాజరుపరిచారు. మిగిలిన A1 గురుగు రాజశేఖర్, A4 ప్రశాంత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఆక్రమణలు, బెదిరింపులు, ఆస్తి నష్టం వంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ SHO, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల(Law and Order)కు భంగం కలిగించే ఘటనలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.
