Friday, February 13, 2026
Homeకరీంనగర్KOTA | కోట విద్యార్థికి నావిక విభాగంలో లెఫ్టినెంట్ ఉద్యోగం

KOTA | కోట విద్యార్థికి నావిక విభాగంలో లెఫ్టినెంట్ ఉద్యోగం

  • దేశవ్యాప్తంగా 336 పోస్టుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికే అవకాశం
  • అభినందించిన కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి

కరీంనగర్‌లోని కోట జూనియర్ కళాశాలలకు చెందిన ఇంటర్ విద్యార్థి కే.వినయ్ కేంద్రీయ సర్వీసులకు చెందిన భారత నావికాదళంలో లెఫ్టినెంట్ ఉద్యోగానికి ఎంపిక కావడం గర్వకారణమని కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 336 ఉద్యోగాలు భర్తీ చేయగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారని, అందులో తెలంగాణ నుంచి కే.వినయ్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం అని ఆయన పేర్కొన్నారు.

బుధవారం కోట విద్యాసంస్థల్లో లెఫ్టినెంట్ ఉద్యోగానికి ఎంపికైన కే.వినయ్‌కు నిర్వహించిన అభినందన సభలో డాక్టర్ డి. అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిరంతర కృషి, లక్ష్యంపై అచంచలమైన దృష్టి ఉంటే ఏ విద్యార్థికైనా జాతీయ స్థాయి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. కోట జూనియర్ కళాశాలల విద్యార్థుల్లో పోటీ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

- Advertisement -

కే.వినయ్ సాధించిన విజయం కేవలం వ్యక్తిగత ఘనత మాత్రమే కాకుండా, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి విజయాలు భవిష్యత్‌లో మరెన్నో విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోట విద్యాసంస్థల అధ్యాపకులు, నిర్వాహకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కే.వినయ్‌ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

తన విజయానికి తల్లిదండ్రుల సహకారం, గురువుల మార్గదర్శనం, కోట సంస్థ అందించిన శిక్షణే ప్రధాన కారణమని కే.వినయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశసేవ చేయాలనే లక్ష్యంతో నావికాదళంలో చేరడం తన జీవితంలో అత్యంత గర్వకారణమైన ఘట్టమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News